ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

82చూసినవారు
రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. అగ్ని ప్రమాదాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ప్రజల్లో అవగాహన కోసం వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ముగింపు కార్యక్రమం వరంగల్ ఫైర్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ భారీ, ఫైర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్