హన్మకొండ: వెళ్లి రావమ్మా బతుకమ్మ

64చూసినవారు
హన్మకొండ లోని 57వ డివిజన్ శ్రీకృష్ణ కాలనీ వీధి నెంబర్-2లో తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో నేలతల్లి పులకించిపోయింది. గురువారం ఉదయం నుంచే ఆడబిడ్డలు పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దారు. సాయంత్రం ప్రధాన కూడళ్లకు చేరుకుని బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో అంటూ పాటలతో హోరెత్తించారు. సమీపంలోని గాంధీనగర్ పోచమ్మ దేవాలయం ప్రాంగణంలో నిమజ్జనం చేసి పోయిరా గౌరమ్మా పోయిరావమ్మా అంటూ వీడ్కోలు పలికారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్