పిల్లలు చిన్నతనం నుండే పోటీతత్వాన్ని అలవరుచుకోవాలని జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి సాయి కుమార్ అన్నారు. బుధవారం వరంగల్ లోని బాలుర పరిశీలక గృహము లో నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో వారితో పాటు హనుమకొండ న్యాయసేవ సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే పాల్గొన్నారు. పిల్లలలోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఆటల పోటీలు నిర్వహించి మెమంటోలు, సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు.