భారత రాజ్యాంగానికి లోబడే ప్రతీ ఒక్కరూ పనిచేయాలని రాజ్యాంగాన్ని చదివి హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు టి. జీవన్ గౌడ్ అన్నారు. మంగళవారం బార్ అసోసియేషన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేసి, దేశంలో అధికారానికి మూలధారం ప్రజలు ఆ అవకాశం కేవలం రాజ్యాంగం కల్పించిందని సీనియర్ న్యాయవాదులు తెలిపారు.