వరంగల్ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు అందజేసే ఫిర్యాదులను స్వీకరి స్తామని పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు ప్రజావాణిలో పాల్గొని ప్రజలు అందజేసే దరఖాస్తులను స్వీకరించి, సమస్యలు పరిష్కరించాలని సూచించారు.