హన్మకొండలో నవంబర్ 30, డిసెంబర్ 01న తల పెట్టిన ఇండియన్ అసోసియేషన్ అఫ్ లాయర్స్ రాష్ట్ర రెండవ మహా సభలను విజయవంతం చేయాలని జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ పిలుపునిచ్చారు. సోమవారం అడ్వకేట్స్ కాలనీలోని జిల్లా కార్యాలయంలో ముఖ్య సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు చర్చినున్నట్లు తెలిపారు.