వచ్చే వర్షాకాలం నాటికి నియోజకవర్గ పరిధిలోని అన్ని కాలనీలలో వర్షపు నీరు నిలవకుండా చేస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం విజయ గణపతి కాలనీ, విద్యారన్యపురి, శంకర్ నగర్ లలో పర్యటించారు. కాలనీల్లో ప్రధాన సమస్యలుగా ఉన్న సైడ్ డ్రైనేజీ, అంతర్గత రోడ్ల నిర్మాణం పై ప్రత్యేక దృష్టితో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.