మొక్కల పెంపకానికి వీలుగా నర్సరీల్లో అదనపు షెడ్ లు ఏర్పాటు చేయాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. హన్మకొండలో బల్దియా నిర్వహిస్తున్న రెండు నర్సరీలను శనివారం క్షేత్రస్థాయిలో సందర్శించి చేయాల్సిన ఏర్పాట్ల పై అధికారులకు తగు సూచనలు చేశారు.