కేంద్ర బడ్జెట్లో బిజెపి ప్రభుత్వం విద్యారంగానికి మొండి చేయి చూపించిందని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ అన్నారు. బుధవారం రంగశాయిపేట ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ బడ్జెట్ ప్రసంగంలో ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఒక్క మాట కూడా లేదని కేంద్ర ప్రభుత్వం విద్య పట్ల ఆసక్తి లేనట్టు కనబడుతుందని అన్నారు.