కాజీపేట ఫాతిమా అడ్డా ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై మంగళవారం కాజీపేట ట్రాఫిక్ సీఐ నాగబాబు, ఎస్సై రావెళ్ళ రామారావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో నడిపే డ్రైవర్లు విధిగా యూనిఫామ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఆర్సీతో పాటు బ్యాడ్జి కూడా తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, మందు తాగి ఆటో నడపవద్దని పలు సూచనలు చేశారు.