హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో జూనియర్ ఫాకల్టీ లో పని చేస్తున్న సాయి చరణ్ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా హసన్ పర్తి డీఆర్డీఏలో మంగళవారం పదవీ విరమణ ఆత్మీయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ హాజరయ్యారు. సాయి చరణ్ కి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. గత 34 సంవత్సరాలుగా పంచాయతీరాజ్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారన్నారు.