తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్డెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోందని అన్నారు. దక్షిణాదిరాష్ట్రాల్లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 86 శాతం ఎక్కువని తెలిపారు. దేశ జీడీపీలో తెలంగాణ జీడీపీ శాతం 4.6 ఉండటం గర్వకారణమన్నారు.