బీసీ కులగణనకు కట్టుబడి ఉన్నాం: మంత్రి కోమటిరెడ్డి

64చూసినవారు
బీసీ కులగణనకు కట్టుబడి ఉన్నాం: మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్రంలో బీసీ కులగణనకు తాము కట్టుబడి ఉన్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గాంధీ‌భవన్‌లో కుల‌ గణనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహిస్తున్న సమావేశానికి ఆయన హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ బీసీ కుల గణన తెలంగాణలో చరిత్ర సృష్టించబోతోందని తెలిపారు. రైతు రుణమాఫీ గురించి మాట్లాడే కనీస అర్హత హరీశ్‌రావుకు లేదని మండిపడ్డారు. విపక్షాలు కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడానికే ఉన్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్