పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నాం.. కానీ: కవిత

75చూసినవారు
పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నాం.. కానీ: కవిత
పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని.. కానీ ఈ విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును వ్యతిరేకిస్తున్నట్లు BRS MLC కవిత తెలిపారు. 'పసుపు బోర్డు ఏర్పాటుపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? నిజంగా రైతుల కోసమే ఈ నిర్ణయమైతే పసుపు మద్దతు ధర ప్రకటించాలి. పసుపు బోర్డు కోసం BRSయే పోరాటం ప్రారంభించింది. నిజామాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ తీసుకురావాల్సిన బాధ్యత అర్వింద్‌పై ఉంది’ అని నిజామాబాద్‌లో వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్