TG: ఈ దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆన్నారు. రవీంద్రభారతిలో ఉగాది వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ నిర్మించి దేశానికి ఆదర్శంగా నిలుస్తామన్నారు. పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ రూపకల్పన ఉంటుందన్నారు. మూసీ నది ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు ఇందులో భాగమే అన్నారు. ప్రపంచ స్థాయిలో HYDకు గుర్తింపు ఉండాలని ఆకాంక్షించారు.