TG: బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో అర్ధరాత్రి ఆగంతకుడు ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎంపీ అరుణతో ఘనపై ఫోన్‌లో ఆరా తీశారు. ఎంపీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రత పెంచుతామని డీకే అరుణకు హామీకి ఇచ్చారు. విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని పోలీసులను సీఎం ఆదేశించారు. భద్రత పెంచాలని పోలీస్ శాఖకు సూచించారు.