బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. త్వరలోనే ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా భారత్ అవతరించబోతుందని అన్నారు. వక్ఫ్ బోర్డులో సంస్కరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని, 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొస్తామని అన్నారు. దేశాభివృద్ధికి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని, సంక్షేమ పథకాలు పేదలకు లబ్ధి కలిగిస్తున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు.