వార ఫలాలు (03-04-2022 నుంచి 09-04-2022)

48863చూసినవారు
వార ఫలాలు (03-04-2022 నుంచి 09-04-2022)
మేషం
వ్యాపారం చేసేవారు చేపట్టే పనులలో విజయాన్ని సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరిగినప్పటికీ, అధికారుల ఆదరణ లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల వారం. పనులలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. భూములు కొనడం, గృహ నిర్మాణం చేపట్టడం వంటి నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభం
అదృష్టం కలిసి వస్తుంది. రోజువారీ కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి. చేస్తున్న పనిలో సంతృప్తి పొందుతారు. వృథా ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం అవుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. పదోన్నతి, స్థానచలన అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు అనుకూలం. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వెళతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. నిలిచిపోయిన పనులలో కదలిక వస్తుంది. ఉత్సాహంతో ఉంటారు. అనుకోని ఖర్చులు ముందుకు రావడం వల్ల పనుల్లో జాప్యం జరగవచ్చు. ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తవుతాయి.

మిథునం
ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. పనులు నెరవేరుతాయి. వాహనాల మరమ్మతుల కారణంగా ఖర్చు పెరుగుతుంది. భూ లావాదేవీల్లో అప్రమత్తత అవసరం. గృహ నిర్మాణ పనులు చేపడతారు. ఆర్థిక వనరులు సమకూరకపోవడంతో ఆలస్యం జరగవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తిగా ఉంటుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. నాయకులు ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు. సమాజంలో గుర్తింపును పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం.

కర్కాటకం
రావలసిన డబ్బు అందుతుంది. ఆత్మీయులు, స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. చెల్లింపుల విషయంలో శ్రద్ధ చూపుతారు. విద్యార్థులు శ్రమించాల్సిన సమయం. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. అదనపు ఆదాయంపై దృష్టి సారిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. భూ లావాదేవీల్లో అప్రమత్తత అవసరం. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రభుత్వ పనులలో సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు.

సింహం
భక్తి పెరుగుతుంది. మిత్రుల కలయిక, ఆత్మీయులతో సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. నలుగురిలో మంచిపేరును సంపాదిస్తారు. పెట్టుబడులకు ప్రతిఫలాలను పొందుతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోదాలకు హాజరవుతారు. ప్రభుత్వ పనుల్లో కాలయాపన ఉండవచ్చు. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాహనాల మూలంగా పనులు కలిసివస్తాయి.

కన్య
పెట్టుబడులకు ప్రతిఫలాలను పొందుతారు. ఆఫీసులో అనవసరమైన విషయాలలోకి వెళ్లకుండా పనులపై మనసు నిలపడం మంచిది. విద్యార్థులు శ్రమించాలి. వ్యాపారులకు భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. అనవసరమైన ఆలోచనల మూలంగా మనస్తాపం చెందుతారు. పలుకుబడితో కొన్ని పనులు నెరవేరుతాయి. ఆదాయ మార్గాలను ఆలోచిస్తారు. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. పారిశ్రామికవేత్తలు న్యాయ సమస్యలను అధిగమిస్తారు. అందరి సహకారం లభిస్తుంది. ఖర్చుల నియంత్రణ అవసరం.

తుల
కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రయాణాల వల్ల అలసట, ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నలుగురిలో మంచిపేరును సంపాదిస్తారు. అనుకున్న పనులు ఆత్మీయులతో నెరవేరుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. కొత్త వ్యక్తులతో కార్య సాఫల్యం ఉంటుంది. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రభుత్వ పనులు కలిసివస్తాయి. భూముల కొనుగోలుకు అనుకూల సమయం. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. కళాకారుల ఆదాయం పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం
ఆదాయం స్థిరంగా ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు తలపెడతారు. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కొత్త వ్యాపారం చేపట్టే ఆలోచన చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు పాక్షికంగా నెరవేరుతాయి. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయులు, స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు పనిచేసే చోట వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వాహనాల కొనుగోలులో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆదాయ మార్గాలపై శ్రద్ధ చూపుతారు. రాజకీయ నాయకులకు కార్యకర్తల సహకారం లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులు సంతృప్తికరంగా ఉంటారు.

ధనుస్సు
ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తిచేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉత్సాహంతో ఉంటారు. రావలసిన డబ్బు కొంత చేతికి అందుతుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త పరిచయాలతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అధికారుల అనాదరణతో ఉద్యోగులు కొంత మనస్తాపానికి గురవుతారు. సంయమనం అవసరం. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు భాగస్వాములతో మంచి అవగాహన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.

మకరం
నలుగురిలో గుర్తింపు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయంలో అస్థిరత మూలంగా కొన్ని పనులలో జాప్యం జరగవచ్చు. విద్యార్థులకు అనుకూలం. పెద్దల సహకారం లభిస్తుంది. ఆత్మీయులతో భేదాభిప్రాయాలు రావచ్చు. సంయమనం పాటించండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రభుత్వ పనులు కలిసివస్తాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు వస్తాయి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, కార్య నిర్వహణపై మనసు నిలుపుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. తీర్థయాత్రలు చేపడతారు.

కుంభం
ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే అనుకోని ఖర్చుల మూలంగా చేతిలో డబ్బు నిలవక పోవచ్చు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పలుకుబడితో కొన్ని పనులు నెరవేరుతాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టి సారిస్తారు. విందులకు హాజరవుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.

మీనం
విశ్వాసంతో పనులు చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. చేపట్టిన ప్రయాణాలు సత్ఫలితాలను ఇస్తాయి. శుభకార్యాల మూలంగా ఖర్చులు పెరగవచ్చు. ఆస్తి వ్యవహారాల్లో సోదరులతో ఉన్న వివాదాలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలుపై మనసు నిలుపుతారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉంటూ సంయమనంతో పనులు పూర్తిచేస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్