దేశంలో ప్రస్తుతం టమాటా, ఉల్లి ధరలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వందపైనే పలుకుతున్నాయి. అయితే బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వే ధరలు పెరగడానికి గల కారణాలను వెల్లడించింది. విపరీతమైన వాతావరణం, తక్కువ రిజర్వాయర్ స్థాయిలు, పంట నష్టం వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేసిందని పేర్కొంది. ఇది గత రెండేళ్లలో ఆహార ధరలు పెరగడానికి దారితీసిందని ఆర్థిక సర్వే తెలిపింది.