బంగ్లాదేశ్ ఇప్పుడు స్వేచ్ఛను పొందినట్లు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డాక్టర్ మొహమ్మద్ యూనుస్ తెలిపారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో .. ఫ్రీ కంట్రీగా మారిందన్నారు. గత కొన్ని వారాలుగా బంగ్లాలో 30 శాతం రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ ప్రజలు ఇప్పుడు విముక్తిని పొందినట్లు ఫీలవుతున్నారని ఓ ఇంటర్వ్యూలో యూనుస్ పేర్కొన్నారు.