శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో అండాళ్ అమ్మవారికి ఉంజల్ సేవల పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. యాదాద్రిలో శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో సాయంత్రం ఆలయం మండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊంజల్ సేవ మహోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3. 30 గంటలకు ఆలయాన్ని తెరచిన అర్చకులు సుప్రభాత, అర్చన, అభిషేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించారు.