తుర్కపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన చత్రపతి శివాజీ దిమ్మెను రాత్రికి రాత్రే తొలగించిన పోలీసులు. గ్రామస్తులు అందరూ ఐక్యమత్యంతో ఏర్పాటు చేసుకున్న చత్రపతి దిమ్మెను గ్రామస్తులకు తెలియకుండా రాత్రికి రాత్రే తొలగించడం జరిగింది. దానికి తుర్కపల్లి మెయిన్ చౌరస్తాలో రాస్తారోకో చేసి నిరసన తెలుపుతున్న గ్రామస్తులు, అన్ని పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.