భువనగిరి: సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా నోట్ పుస్తకాల పంపిణీ

80చూసినవారు
భువనగిరి: సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా నోట్ పుస్తకాల పంపిణీ
భువనగిరి మండలం తుక్కాపూర్ గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్ లో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడుమేకల మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎండీ. ఆవేస్ చిస్తి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ లు హాజరై హైస్కూల్ లోని విద్యార్థులందరికీ నోటు పుస్తకాలను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్