బీబీనగర్ పట్టణానికి చెందిన మంద పెద్ద యాదగిరి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి బుధవారం వారి కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. బీబీనగర్ మండల మాజీ కో ఆప్షన్ మెంబర్ ఎండి అక్బర్ చేతుల మీదుగా అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బంటు నరసింహ, పిట్టల శ్రీనివాస్, ఎర్రోళ్ల వెంకటేష్, గుండె గళ్ళ వేణు, ముదిరాజ్ సభ్యులు పాల్గొన్నారు.