మార్కెట్ ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకంకు మెనూ చార్జీలు పెంచి కోడిగుడ్లు, వంటగ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం రోజున మెనూ చార్జీలు పెంచి మధ్యాహ్న భోజన వంట కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకి వినతిపత్రం సమర్పించడం జరిగింది.