అసంఘాటీత రంగా కార్మికులైన ఆటో డ్రైవర్ల కోసం ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ యాదగిరిగుట్ట కార్యాలయంలో జై హనుమాన్ ఆటో డ్రైవర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) సభ్యుల జనరల్ బాడీ సమావేశం తుమ్మల ఇస్తారీ అధ్యక్షతన జరిగింది.