16న జేఎన్టీయూలో మెగా జాబ్ మేళా
హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్ లో ఈ నెల 16న మెగా జాబ్ మేళా-2023 నిర్వహిస్తున్నట్లు వీసీ నర్సింహారెడ్డి వెల్లడించారు. వంద కంపెనీలు ఇందులో పాల్గొని 10వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాయని తెలిపారు. 2016-2023 మధ్య ఉత్తీర్ణులైన వారు ఇందులో పాల్గొనవచ్చని తెలిపారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, డిగ్రీ, పీజీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని స్పష్టం చేశారు.