బాత్రూమ్లో జారిపడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తన నివాసంలోని బాత్రూంలో జారిపడ్డారు. ఆయన తలకు గాయమైంది. లూలా ప్రస్తుతం బాగానే ఉన్నారని, ఆయన తలకు కుట్లు వేశారని డాక్టర్లు చెప్పారు. దీంతో వైద్యుల సూచన మేరకు రష్యాలో జరగనున్న బ్రిక్స్ సదస్సు కార్యక్రమానికి నేరుగా హాజరు కాలేకపోతున్నారని ఆయన కార్యాలయం వెల్లడించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని ప్రకటన విడుదల చేసింది.