పద్మశ్రీ అవార్డు గ్రహీత కన్నుమూత
పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు కన్నుమూశారు. ఆదిలాబాద్‌లోని మార్లవాయిలో తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గుస్సాడి నృత్యానికి కనకరాజు జాతీయ గుర్తింపు తెచ్చారు. కనకరాజును 2021లో పద్మశ్రీతో కేంద్రం సత్కరించింది. శనివారం మార్లవాయిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.