రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో రేపు (సోమవారం) అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈనెల 14 వరకు రాష్ట్రంలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం.. కాకినాడ, కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.