ఢిల్లీలో వాయు కాలుష్యానికి కళ్లెం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. ఈ తరుణంలో గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) ఆప్ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. వెంటనే ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-2’ను అమల్లోకి తేవాలని సూచించింది. యంత్రాలతో రోడ్లను ఊడ్పించడం, వాహనాల పార్కింగ్ ఛార్జీలను పెంచడం, బాణాసంచా నిల్వ, డిజీల్ జనరేటర్ల వినియోగం వంటి రూల్స్‌పై చర్యలు చేపట్టాలని ఢిల్లీ సర్కారును CAQM కోరింది.