
దేశవ్యాప్తంగా ఈసారి మండిపోనున్న ఎండలు
దేశవ్యాప్తంగా ఈసారి ఎండలు మండిపోనున్నాయి. గతేడాది కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయిని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఫిబ్రవరి కూడా ముగియలేదు.. అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీన్నిబట్టే ఈసారి ఎండలు ఎలా ఉండనున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ సారి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయట.