ఉపాధి కూలీలకు వెంటనే కూలి డబ్బులు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నిర్మల డిమాండ్ చేశారు. గుత్తి మండలం మామిళ్ల చెరువు గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను శనివారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి నుంచి కూలీలకు కూలి డబ్బులు ఇవ్వలేదన్నారు. కనీస వసతులు కూడా లేవని పనులు చేయడానికి పరికరాలు కూడా లేవని వాపోయారు.