సహాయం అందించిన ఫ్రెండ్ షిప్ హ్యాండ్స్

ఐ.పోలవరం మండలం మురముళ్ల గ్రామం యూనివర్సల్ వెల్ఫేర్ ట్రస్ట్ డే కేర్ సెంటర్ నందు యూనివర్సల్ వెల్ఫేర్ ట్రస్ట్ సామర్లకోట వారి ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం గవర్నమెంట్ హై స్కూల్ లో చదివిన 2004 10వ తరగతికి చెందిన వారు ఫ్రెండ్ షిప్ హ్యాండ్స్ గ్రూప్ వారు దివ్యాంగులకు కావాల్సిన కిరాణా కిట్లు ఛైర్స్, భోజనం టేబుల్ ప్లేట్స్, 2 బెడ్స్, దుప్పట్లు పంపిణీ చేసారు. దివ్యాంగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. సహాయం అందించటం చాలా ఆనందగా ఉందని, దానికి సహాయం అందించిన ఫ్రెండ్ షిప్ హ్యాండ్స్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్ షిప్ హ్యాండ్స్ సభ్యులు శ్రీనివాస్, రాజేష్, సతీష్, సుధ, నరసింహం యూనివర్సల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు నరవ రాజు ప్రేమ్ నాథ్, ఉషోదయ మండల సమాఖ్య అధ్యక్షుడు కె.శ్రీనివాస్, అన్నపూర్ణ వికలాంగుల సమాఖ్య అధ్యక్షుడు జంపాన రంభద్రజు, జొన్నడా రాజు, గౌరి, ప్రసాద్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్