ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే కూటమి ప్రభుత్వం ఆకాంక్ష అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అదానీ కేసులో మాజీ సీఎం జగన్ ప్రమేయం ఉందని ఆరోపించారు. జగన్ ఆర్థిక విధ్వంసం చేశాడని మండిపడ్డారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసే విధంగా చర్యలు చేపట్టి శిక్ష పడేలా చేస్తామని పేర్కొన్నారు.