ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని తూ. గో జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఆమె పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని 126 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.