తాడేపల్లిగూడెం: ఉచిత ఇసుక పథకం అమలు చెయ్యాలి

కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక పథకం అమలు కాక భవన నిర్మాణ కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు సిరపరపు రంగారావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు దూలం ప్రసాద్ విమర్శించారు. ఉచిత ఇసుక పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పెంటపాడు తహశీల్దార్ కార్యాలయం ధర్నా నిర్వహించారు. తహశీల్దార్ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్