నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం, సూరవరం సచివాలయం వద్ద గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 14 దరఖాస్తులు వచ్చినట్లు తాసిల్దార్ పిఎన్వి ప్రసాద్ గురువారం తెలిపారు. సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రి సర్వే డిప్యూటీ తాసిల్దార్ మరియన్న, రెవెన్యూ కార్యదర్శిలు, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు.