అమలాపురం ఆర్టీవో కేశవర్దన్ రెడ్డి ప్రభుత్వం నుండి ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రం గురువారం అందుకున్నారు. అమలాపురంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో మంత్రి వాసంశెట్టి సుభాష్, కలెక్టర్ మహేష్ కుమార్ ఆయనకు ప్రశంస పత్రాన్ని అందజేసి అభినందించారు.