ఆముదాలకుంటలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం

చెన్నై కొత్తపల్లి మండలంలోని కనుముక్కల సచివాలయం- 2 పరిధిలోని ఆముదాలకుంట గ్రామంలో సోమవారం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్. ఎస్. గేట్ పీహెచ్సీ కనుముక్కల సబ్ సెంటర్ వైద్య సిబ్బంది నిర్వహించారు. గ్రామంలోని బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలున్నారు.

సంబంధిత పోస్ట్