విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని జలుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి పద్మావతి అన్నారు. మంగళవారం ఉదయం జలుమూరు మండల కేంద్రంలోని స్థానిక కస్తూరిబా గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వ్యాధులు పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి చిన్న రాజులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.