కవిటి మండలం మండల విద్యాశాఖ కార్యాలయంలో సోమవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డ్స్ ను ఎంఈవో ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ఎఫ్ఎ 1 ఎస్ఏ 2 మార్కులను ఈనెల ఏడవ తారీఖున జరగబోయే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నందు తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యులు, సీఆర్ఎంటీ తులసి, ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.