కంచిలి: అధ్వానంగా రహదారి.. బురదలో ఇరుక్కుపోయిన ఆటో

59చూసినవారు
కంచిలి: అధ్వానంగా రహదారి.. బురదలో ఇరుక్కుపోయిన ఆటో
కంచిలి మండలం ఎంఎస్ పల్లి మోడల్ స్కూల్కు చేరుకోవాలంటే సాహసం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాలకు వెళ్లే రహదారి అధ్వానంగా తయారయింది. ఆటోలో విద్యార్థులు సోమవారం పాఠశాలకు వెళ్తుండగా బురదలో ఆటో ఇరుక్కుపోయింది. దీంతో బురదమయంగా మారిన రహదారిపై విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్