పశు బీమాకు రాయితీ నిధులు విడుదల అయినట్లు గంట్యాడ సబ్ డివిజన్ పశుసంవర్ధక శాఖ ఏ. డి రెడ్డి కృష్ణ శనివారం విలేకరులకు తెలిపారు. గంట్యాడ మండలంలో 125, జామి మండలంలో 115 పశువులకు భీమానిధులు విడుదలైనట్లు చెప్పారు. గతంలో రాయితీ లేని కారణంగా భీమ చేయించని పశు యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.