ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లలో AI చాట్ బాట్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే రెండు మొబైల్స్ ఒక దగ్గర పెట్టి చిన్న కమాండ్ ఇవ్వగా వాటిలోని AI చాట్ బాట్లు ఒకదానికొకటి మాట్లాడుకుంటున్నాయి. ఆ చాట్ బాట్లు ఒకదానికొకటి తమ ఇష్టాలు తెలుసుకోవడంతో పాటు, ఇటీవల అవి నేర్చుకున్న కొత్త విషయాల గురించి కూడా మాట్లాడుకుంటున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.