TG: గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థులకు సంబంధించి TGPSC కీలక ప్రకటన చేసింది. పరీక్ష రాసే అభ్యర్థులు దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. ఈ నెల 16న ఉ.10 గంటల నుంచి 20వ తేదీ సా. 5గంటల వరకు ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. మరోసారి ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. ఎడిట్ చేసుకున్నాక అభ్యర్థులు PDF ఫార్మాట్ లో అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని కమిషన్ సూచించింది. SHARE IT

సంబంధిత పోస్ట్