పంజాబ్‌లోని జలంధర్‌లో మూగ జంతువులపై పదేపదే హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మన్‌దీప్ అనే వ్యక్తి పిల్లుల కాళ్లు కట్టేసి తన దగ్గర ఉన్న కుక్కలతో వాటిపై దాడులు చేయిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. వెంటనే స్పందించిన పోలీసులు మన్‌దీప్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు.