ఇంట్లో చెప్పులు ఉండాల్సిన చోట ఉండకపోతే దురదృష్టం వెంటాడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. చెప్పులు చిందర వందరగా ఉంచకూడదు. అలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వస్తాయట. తూర్పు, ఉత్తర దిక్కులో చెప్పులు వదలకూడదు. నైరుతిలో మాత్రమే చెప్పులు, షూష్ ఉంచాలని వాస్తు పేర్కొంటోంది. ఇంటి ముఖద్వారం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవని వాస్తుశాస్త్రం చెబుతోంది.