మూత్రంలో రక్తం కనిపించగానే క్యాన్సర్ సంకేతమేనని మనలో చాలా మంది భయపడుతుంటారు. అలా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ నుంచి కిడ్నీలో రాళ్లు, 50 ఏళ్లు దాటిన తర్వాత ఏర్పడే గడ్డలు.. ఇలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన తర్వాత మూత్రంలో రక్తం పడితే జాగ్రత్త పడాలి. మనకు నొప్పి లేకుండా రక్తం పడుతుంటే 30 శాతం క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంకా మూత్రంలో రక్తం పడుతుంటే పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది.