సహజసిద్దమైన గుమ్మడికాయ గుజ్జుతో ఇంట్లోనే తయారు చేసుకునే ఫేస్ ప్యాక్స్ చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. గుమ్మడిని ఫేస్‌ప్యాక్స్‌లో ఉపయోగించడానికి ముందుగా దాన్ని ఉడికించుకొని మెత్తగా ముద్దలా చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న మెత్తని గుమ్మడి గుజ్జుతో ఫేస్‌ప్యాక్‌ను తయారు చేసుకోవాలి. గుమ్మడి గుజ్జు, పెరుగు, కాస్త తేనె, కొన్ని చుక్కుల నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి రాసుకుంటే నిగారింపునిస్తుంది.